News

vasantha krishna prasad, మైలవరం జిలేబీ దేవినేని ఉమా.. వైసీపీ ఎమ్మెల్యే వసంత సెటైర్లు – ysrcp mla vasantha krishna prasad satires on devineni uma


మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేవినేని ఉమా అనే వ్యక్తి మైలవరం జిలేజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. మైలవరం జిలేబీ దేవినేని ఉమా అని.. ఆయన చేసేవన్నీ జిలేబీ పనులేనని ఎద్దేవా చేశారు. అలాగే, జీవన్మృతుడు దేవినేని ఉమా అంటూ ఎద్దేవా చేశారు.గతంలో తాను ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో దేవినేని ఉమా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. గతంలో తమ నాయకులపై రౌడీ షీట్లు తెరిపించిన చరిత్ర దేవినేని ఉమాది అని ఫైరయ్యారు. అయితే, ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. దేవినేని ఉమ అధికారంలో ఉన్నంత కాలం మైలవరం నియోజకవర్గంలో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోయాడని ఆరోపించారు.

తమ హయాంలో జల జీవన్ మిషన్‌తో ఇంటింటికి నీటి కుళాయిని ఇస్తున్నామని ఎమ్మెల్యే వసంత తెలిపారు. మైలవరంలో పదేళ్లు శాసనసభ్యునిగా ఉండి పట్టాలు ఇవ్వడం చేతగాని దద్దమ్మ దేవినేని ఉమా అని ఎద్దేవా చేశారు. ఇక, మైలవరం అయ్యప్ప నగర్ పేరు మార్చాలని ఆలోచన వచ్చినా.. చెప్పు తెగుద్ది అంటూ దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఉమా శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు: ఎమ్మెల్యే వసంత

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button