Entertainment

Kantara: కాంతార చిత్రాన్ని వీడని వివాదాలు.. మరోసారి చిక్కుల్లో రిషబ్ శెట్టి.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..


హీరో రిషబ్ శెట్టి.. నటన.. స్క్రీన్ ప్లే ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల చేసిన డబ్బింగ్ వెర్షన్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పుడు ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు కాంతార. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది ఈ చిత్రం. ముందు చిన్న సినిమాగా కన్నడ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ..ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో భారీగా కలెక్షన్స్ అందుకుంటుంది. అంతేకాకుండా..హీరో రిషబ్ శెట్టి.. నటన.. స్క్రీన్ ప్లే ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల చేసిన డబ్బింగ్ వెర్షన్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఓవైపు హిట్ టాక్‏తో అదరగొడుతున్న ఈ సినిమాకు వివాదాలు కూడా తప్పడం లేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని వరాహ రూపం సాంగ్ పై కేరళలోని కోయిక్కోడ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని.. థియేటర్లలో అసలు వినిపించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా మరోసారి చిత్రబృందానికి పాలక్కాడ్ కోర్టు నుంచి షాక్ తగిలింది. కేరళలోని పాలక్కాడ్ స్థానిక కోర్టు ఈ పాటను నిలిపివేయాలని ఆదేశించింది.

వరాహరూపం పాట కాపీ చేశారంటూ తైక్కుడం బ్రిడ్జ్ యూనిట్ ఆరోపించింది. తన నవరసం ట్యూన్‏ను వరాహరూపం పాటలో ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. వరాహ రూపం పాటపై కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారించిన కేరళ స్థానిక కోర్టు వరాహరూపం పాటపై స్టే విధించింది. ఇక ఇప్పుడు పాలక్కాడ్ కోర్టు కూడా ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి



ఈ విషయమై ‘మాతృభూమి మ్యూజిక్’ పాలక్కాడ్ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ‘తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ పాటను ఎక్కడా షేర్ చేయడం గానీ, ప్రసారం చేయడం గానీ కుదరదు’ అని పేర్కొంది. కోర్టు ఆదేశాల తర్వాత కాంతార చిత్రయూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.. ‘తైక్కుడం బ్రిడ్జ్’ బ్యాండ్‌కు చెందిన వియాన్ ఫెర్నాండెజ్ ఇటీవలే మాకు క్రెడిట్ ఇస్తే ఈ పాటను ప్లే చేయడానికి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button