Uttam Kumar Reddy On Congress Winning Seats,తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లొస్తాయో అనుభవంతో చెప్పిన సీనియర్ నేత – mp uttam kumar reddy comments on congress winning seats in telangana
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తుక్కుగూడ సభలో కనిపించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పార్టీ కార్యకర్తలంతా ఈ నెల 17 ఇంటి గడప దాటి బయటకు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సిన సమయం ఇదని.. కార్యకర్తలంతా నూతనోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు దిమ్మ తిరిగేలా తుక్కుగూడ సభ సౌండ్ కేసీఆర్‌కు వినిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వబోతున్నామన్నారు. సోనియాగాంధీ ఈ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశాలు దేశానికి మంచి సంకేతాన్ని ఇస్తాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే. బహిరంగ సభ అనంతరం 18న కాంగ్రెస్ నాయకులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఐదు గ్యారంటీ కార్డు స్కీంలపై ప్రచారం చేయాలని.. బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఐదు గ్యారంటీలను సోనియా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు మల్లిఖార్జున ఖర్గే, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద ఉండే అరుదైన సభకు అందరూ హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అనుసరించాల్సిన వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్‌సాగర్‌రావు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కమిటీ చర్చించింది. గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన మేలు గురించి ప్రజలకు వివరించేలా పార్టీ వ్యూహాన్ని తయారు చేస్తామని చెప్పారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో చార్జిషీట్లు విడుదల చేయాలని.. రాష్ట్ర స్థాయిలో వేసే చార్జిషీట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ చార్జిషీట్‌లు వేయాలని టీపీసీసీ చార్జిషీట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.