Entertainment

Ram Charan-Upasana: రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ఉపాసన.. ఈ సంవత్సరం నా భర్తదే అంటూ..


ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలతోపాటు.. సినిమాలకు అన్ని ప్రోగ్రామ్స్ లోనూ చురుగ్గా పాల్గొంటారు ఉపాసన. ఎల్లప్పుడూ తన భర్త చరణ్ వెన్నంటే ఉంటారు. రీసెంట్‌గా ఇండియా ఆవల జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే నడిచారు.

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. ఈ జంటకు ఉండే అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు చరణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉండగా.. మరోవైపు ఉపాసన సైతం బిజినెస్ విషయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. కానీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలతోపాటు.. సినిమాలకు అన్ని ప్రోగ్రామ్స్ లోనూ చురుగ్గా పాల్గొంటారు ఉపాసన. ఎల్లప్పుడూ తన భర్త చరణ్ వెన్నంటే ఉంటారు. రీసెంట్‌గా ఇండియా ఆవల జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే నడిచారు.

ఫారెన్లో జరిగిన ప్రతీ ఈవెంట్లో ఇంటర్య్వూలో.. ఇంటర్నేషనల్ అవార్డు సెర్మనీలో ఆయనతోనే ఉన్నారు. చెర్రీని చీరప్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన హబ్బీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఉపాసన. ఈ ఇయర్ చెర్రీ నామ సంవత్సరం అంటూ చెప్పారు. తన హార్డ్‌ కోర్ ఫ్యాన్‌గా మారిపోయారు.

“నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్ చరణ్ నాకు మద్దతుగా నిలిచారు. అలాగే నేను చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటాను. నాటు నాటు సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లినప్పుడైనా.. ఇంట్లో ఉన్నా.. అలాగే షూటింగ్ అంటూ బిజీగా గడుపుతున్నప్పుడైనా ఇలా ప్రతి విషయంలోనూ నేను చెర్రీకి వెన్నంటే ఉన్నా్ను. ఎలాంటి సందర్భంలోనైనా తనకు నేను శాయశక్తుల సాయం చేస్తుంటాను. ఇక చెర్రీకి ఈ ఏడాది చాలా ఆనందాన్ని ఇచ్చింది. తన వర్క్ పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం చరణ్ ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఈ ఏడాది తనదే ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి





మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button