News

uma shankar reddy wife, వైఎస్ వివేకా లాగే నా భర్తనూ హత్య చంపేస్తారట.. ఉమాశంకర్ రెడ్డి భార్య ఆందోళన – uma shankar reddy wife comments on ys vivekananda reddy case


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా, ఈ కేసులో ఏ 3గా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు వచ్చాయి. పులివెందులలోని స్థానిక పాత బస్టాండు సమీపంలో పాల వ్యాపారం చేస్తున్న తన ఇంటి వద్దకు శనివారం మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి, ఆయన కుమారుడు, మరి కొందరు వ్యక్తులు వచ్చారని బెదిరించారని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు.

ఇంటికి వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని.. నీ భర్త వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని స్వాతి ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి తనపై చెప్పుతో దాడికి ప్రయత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పులివెందుల ఏరియా ఆస్పత్రిలో స్వాతి చికిత్స పొందుతున్నారు.

బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు
‘‘శనివారం మధ్యాహ్నం పరమేశ్వర్ రెడ్డి మా ఇంటికి వచ్చి నాపై దాడి చేశాడు. నీ భర్త ఇంటికొచ్చాక వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపారో అలాగే చంపుతామని బెదిరించారు. అలాగే, నన్ను దుర్భాషలాడారు. నన్ను కూడా చంపుతామని బెదిరించారు. నన్ను ఇక్కడ లేకుండా చేస్తామంటూ.. చెప్పుతో నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాను. పరమేశ్వర్ రెడ్డి కొడుకు కూడా బూతులు తిట్టారు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా పరిస్థితి ఏంటో భయంగా ఉంది. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలి.’’ అని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి పేర్కొన్నారు.

Related Articles

Back to top button