News

uma maheswari postmortem report, NTR Daughter ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్ట్.. – ntr daughter uma maheswari postmortem report says she committed suicide


దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి మృతి కేసులో కీలకమైన పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఉస్మానియా హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్లు శుక్రవారం (ఆగస్టు 5) జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ఉమా మహేశ్వరి మృతి కేసులో పలు ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది.

ఆగస్టు 1న ఉమా మహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉమామహేశ్వరి విగతజీవిగా ఉన్న విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పార్థీవదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉమా మహేశ్వరి చిన్న కుమార్తె దీక్షిత నుంచి వివరాలు సేకరించారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఉమా మహేశ్వరి.. మానసికంగా ఒత్తిడికి గురయ్యారని పోలీసులతో దీక్షిత చెప్పారు. ఈ నేపథ్యంలో బలవన్మరణం చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు తేల్చారు. ఉమామహేశ్వరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:

✦ చంద్రబాబు ఆ కుటుంబానికి శనిలా మారాడు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

✦ శ్మశానవాటికలపై జీఎస్టీ లేదు.. నిర్మలా సీతారామన్ ప్రకటన, నెటిజన్ల సెటైర్లు

Related Articles

Back to top button