News

UK Visa Rules: యూకే వీసా నిబంధనలు కఠిన తరం.. 2024 జనవరి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి – Telugu News | UK visa: International students not allowed to bring family anymore. Read new rules


అగ్రరాజ్యాలు మాత్రం వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ప్రత్యేకించి బ్రిటన్.. తన వీసా విధానంలో సంస్కరణలు తేవాలని ప్రతిపాదించింది. అయితే.. వలసలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ వెల్లడించారు.

వలసలను తగ్గించేందుకే బ్రిటన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. విద్యార్థి వీసాల్లో మార్పుతో బ్యాక్‌డోర్‌ మార్గం బంద్‌ కానున్నట్లు యూకే సర్కార్‌ చెప్తోంది. విదేశీ విద్య కోసం విద్యార్థితోపాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్‌ ఇటీవల స్వస్తి పలికింది. ఈ మేరకు విదేశీ విద్యార్థులకు వీసాలను మరింత కఠినతరం చేసింది. నిజానికి.. బీటెక్, బీఈ పూర్తి చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఎంఎస్ చేయడానికి అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలకు వెళ్తుంటారు. కానీ.. అగ్రరాజ్యాలు మాత్రం వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ప్రత్యేకించి బ్రిటన్.. తన వీసా విధానంలో సంస్కరణలు తేవాలని ప్రతిపాదించింది.

అయితే.. వలసలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ వెల్లడించారు. అంతేగాక.. ఉద్యోగాల్లో బ్యాక్‌డోర్‌ ఎంట్రీలను ఇది అడ్డుకుంటుందన్నారు. విద్యార్థులు తమ వీసాలపై కుటుంబసభ్యులను తీసుకురావడం ఇటీవల విపరీతంగా పెరిగింది. దాంతో ప్రజాసేవలపై తీవ్ర భారం పడుతోంది. ఇకపై పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను తీసుకురాకుండా ఆంక్షలు విధించడం వల్ల వలసలు తగ్గుతాయి. అంతేగాక.. విదేశీ విద్యార్థులు ఉద్యోగం పొందేందుకు దీన్ని బ్యాక్‌డోర్‌ మార్గంగా ఉపయోగించుకోవడం కూడా ఆగిపోతుందని బ్రేవర్‌మన్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ నూతన విధానం గురించి బ్రేవర్‌మన్‌ గత మంగళవారం కామన్స్‌ సభలో ప్రకటించారు.

కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులిక తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకెళ్లడానికి వీలుండదు. ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే కుటుంబ సభ్యులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక, విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేసే వెసులుబాటు లేకుండా పోనుంది. దేశంలో వలసల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రిషిసునాక్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button