News

TSRTC: హైదరాబాద్‌ టూ అరుణాచలం.. బడ్జెట్‌ ధరలో ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు.. – Telugu News | TSRTC offering special buses from hyderabad to arunachalam check here for full details


తమిళనాడులోని అరుణాచలాన్ని సందర్శించుకునే భక్తుల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. గిరి ప్రదిక్షణ చేసేందుకు గాను ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి.

హైదరాబాద్‌ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. నవంబర్‌ 25వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. గతేడాది కూడా ఆర్టీసీ ‘గిరి ప్రదక్షిణ’ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఈసారి కూడా ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇక ఈ బస్సులు హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలుదేరి అదే రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణల పూర్తియిన తర్వాత అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణవుతారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. గతేడాది ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి పెద్ద ఎత్తున బస్సులను పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసారి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ సేవలను వినయోగించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

నవంబర్‌ 25వ తేదీన హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌ నుంచి అరుణాచలంకు బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇక టికెట్‌ విషయానికొస్తే ఒక్కో సీటుకు రూ. 3690గా నిర్ణయించారు. అరుణాచలం టూర్‌పై ఆసక్తి ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆర్టీసీ కౌంటర్స్‌ వద్ద బుక్‌ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం కోసం.. 9959226257, 9959224911, 040-69440000, 04023450033 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Related Articles

Back to top button