News

TSPSC Group I hall tickets: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్! అక్టోబర్‌ 9న విడుదలకానున్న టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు..


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే అక్టోబర్‌ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి..

TSPSC Group I hall tickets: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్! అక్టోబర్‌ 9న విడుదలకానున్న టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు..

TSPSC Group I hall tickets

Srilakshmi C

Advertisement

Srilakshmi C |

Oct 07, 2022 | 9:53 PM




తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే అక్టోబర్‌ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్‌ 9 లేదా 10 నుంచి హాల్‌టికెట్లను కమిసన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెల్పింది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్లో ప్రత్యేక లింకు ఇవ్వనుంది. ఈ 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ దాదాపు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో 225 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఒక్కో పోస్ట్‌కు ఏకంగా 756 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కాగా సెప్టెంబరు నెలాఖరులో పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలు ఉండటంతో, ఈ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహించాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్‌లో నిర్వహించవల్సిన ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌లో నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button