News

TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల.. మర్చి 3 నుంచి దరఖాస్తు స్వీకరణ | Telangana Eamcet 2023 Notification released; check full details here


తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఎంసెట్) నోటిఫికేషన్‌ మంగళవారం (ఫిబ్రవరి 28) విడుదలైంది. ఈ ఏడాది ఎంసెట్‌ 2023 ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూహెచ్‌..

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఎంసెట్) నోటిఫికేషన్‌ మంగళవారం (ఫిబ్రవరి 28) విడుదలైంది. ఈ ఏడాది ఎంసెట్‌ 2023 ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించనుంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 10 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల చేసుకోవచ్చు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ విద్యార్ధులు రూ.900, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.1000)లు చెల్లించవల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ 30 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ అభ్యర్ధులకు మే 7, 8, 9 తేదీల్లో పరీక్ష జరుగుతుంది. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ అభ్యర్ధులకు మే 10, 11 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈసారి కూడా ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా మాత్రమే ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడికల్‌ (బీఈ, బీటెక్‌/ బీటెక్ (బయో-టెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ)/ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

తెలంగాణ ఎంసెట్-2023 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button