Trending Video: విమానంలో గొడవ.. తోటి ప్రయాణీకుడిపై పిడిగుద్దులు.. షర్ట్ విప్పేసి మరీ.. | The video of the fight in the plane has gone viral on social media Telugu news
విమానాలు.. గొడవలకు కేరాఫ్ గా మారాయి. ఒకరినొకరు కొట్టుకోవడం, దాడి చేసుకోవడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. నిన్నటి వరకు మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనను మరవకముందే.. ఇప్పుడు మరో…
విమానాలు.. గొడవలకు కేరాఫ్ గా మారాయి. ఒకరినొకరు కొట్టుకోవడం, దాడి చేసుకోవడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. నిన్నటి వరకు మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనను మరవకముందే.. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం పెరిగిపోతున్నాయి. సిబ్బందిని సైతం వదలకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో గొడవ పడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. చొక్కా విప్పేసి మరీ గొడవ పడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన బిమన్ బంగ్లాదేశ్ విమానంలో జరిగిన ఘటనలో.. బిటంకో బిశ్వాస్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో గొడవ పడడాన్ని చూడవచ్చు. షర్ట్ విప్పేసి మరీ.. తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులు కురిపించాడు. గొడవను అడ్డుకొనేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నిస్తున్నా.. అతను మాత్రం ఆపకపోవడం గమనార్హం. అయితే, గొడవ జరగడానికి కారణాలు ఏమిటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Another “Unruly Passenger” 👊
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘‘ఇలాంటి వ్యక్తులను జీవితం కాలం విమానం ఎక్కకుండా నిషేధించాలి’’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇది బస్సా.. ఫ్లైటా అలా కొట్టుకుంటున్నారేంటి?’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి