News

Trending Stocks: మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నా ఈ స్టాక్ దుమ్మురేపుతోందిగా.. ఒక్కరోజే 10 శాతం జంప్! – top trending stock lambodhara textiles limited jumps 10 percent


Trending Stocks: అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ ప్రస్తుతం 100 పాయింట్ల లాభంతో 61 వేల 50 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 18 వేల 140 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి సెషన్‌లో ఐటీ సెక్టార్ మంచి ఊపులో కనిపిస్తోంది. ఇది ఒక శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మెటల్, రియాల్టీ, హెల్త్ కేర్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఈ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. ప్రస్తుతం టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ రాణిస్తుండగా.. యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డీలాపడ్డాయి.

అయితే మార్కెట్లు పడుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి. ఇవాళ ఒక స్టాక్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. అదే లంబోధరా టెక్స్‌టైల్స్ లిమిటెడ్ (Lambodhara Textiles Limited). Nse Code: LAMBODHARA. ఈ టెక్స్‌టైల్ స్టాక్ ఇవాళ సెషన్‌లో ఆరంభ గంటల్లోనే 10 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ.170 లెవెల్స్‌లో కొనసాగుతోంది.

అంబానీతో డీల్.. నెలరోజులుగా ఈ స్టాక్ అప్పర్‌సర్క్యూటే..

ఇటీవలి కాలంలో టెక్స్‌టైల్స్ సెక్టార్‌కు మంచి డిమాండ్ నెలకొంది. ప్రభుత్వం మంచి మద్దతు, ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో.. ఆ రంగానికి చెందిన కంపెనీలు మంచి లాభాలను ఆర్జించడంతో పాటు.. షేరు విలువలో కూడా దూసుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం సెషన్‌లో లంబోధరా టెక్స్‌టైల్స్ స్టాక్ భారీగా పెరిగింది. దీనికి ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ నెలకొంది.

ఇక టెక్నికల్ పారామీటర్ల పరంగా చూసినప్పటికీ ఈ స్టాక్ ఎబోవ్ యావరేజ్ వాల్యూమ్స్‌తో దూసుకెళ్తోంది. ఒక నెలలోనే 62 శాతం వరకు పెరిగింది. మంచి వాల్యూమ్స్‌తో 52 వారాల గరిష్ట విలువకు దగ్గర్లో ట్రేడవుతోంది. 14 డే RSI కూడా 73.24 తో మంచి బుల్లిష్ జోన్‌ను సూచిస్తోంది. ఈ స్టాక్ రానున్న కాలంలోనూ పెరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే మూమెంటమ్ ట్రేడర్లు ఈ స్టాక్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

  • Read Latest Business News and Telugu News

Also Read: బ్యాంక్ లాకర్లకు కొత్త రూల్స్.. గడువు పొడగింపు.. క్లోజ్ చేసే యోచనలో జనం!

Advertisement

Related Articles

Back to top button