Trending: యూపీలో హిందూ-ముస్లింల ఐక్యత.. ఓం నమఃశివాయ నినాదాలను హోరెత్తించిన ముస్లింలు.. అసలు విషయం ఏమిటంటే | Video Of Muslim Community Chanting Om Namah Shivay In Uttar Pradesh
Viral News: మతాలు ఎన్నున్నా.. మనుషులంతా ఒకటే.. అయితే ఏ మతాల వారు ఆ మత ఆచారాలకు, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. సాధారణంగా హిందూ-ముస్లింలు అంటే గుర్తొచ్చేది మత ఘర్షణలు. ఎవరికివారు తమ మతం గొప్పంటే.. తమ మతం గొప్పనుకుంటుంటారు. అయితే రోటిన్‌కు భిన్నంగా..
Viral News: మతాలు ఎన్నున్నా.. మనుషులంతా ఒకటే.. అయితే ఏ మతాల వారు ఆ మత ఆచారాలకు, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. సాధారణంగా హిందూ-ముస్లింలు అంటే గుర్తొచ్చేది మత ఘర్షణలు. ఎవరికివారు తమ మతం గొప్పంటే.. తమ మతం గొప్పనుకుంటుంటారు. అయితే రోటిన్‌కు భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మత సామరస్యాన్ని చాటుతూ.. ముస్లింలు ఓం నమఃశివాయః నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికి.. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కొందరు ముస్లింలు.. మత ఐక్యతను చాటుతూ.. ఓం నమఃశివాయః అంటూ నినాదాలు చేయడం కనిపిస్తోంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే అశుతోష్ శుక్లా మాట్లాడుతూ.. హిందూ-ముస్లిం ఐక్యతకు ఇది చిహ్నంగా పేర్కొన్నారు. హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా టాకియా పటాన్‌లో శతాబ్ధాల కిందటి పురాతన ఆలయం ఉందని.. ఇక్కడ ఓ వైపు శివుడి ఆలయం.. దానికి ఎదురుగా మొహబ్బత్ షా బాబా సమాధి ఉందని తెలిపారు. మత ఐక్యతను చాటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. హిందువులు కూడా అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లి బాబా దర్గాలో చాదర్ సమర్పించాలని, అదే సమయంలో ముస్లిం సోదరులు ఆలయాలను సందర్శించి మత ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. హిందూ- ముస్లింల ఐక్యతకు చక్కటి నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అనే భావనతో కలిసి మెలసి ఉండాలంటూ మరికొంతమంది తమ కామెంట్స్ పంచుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..