Entertainment

2018 Telugu Movie Review: హైలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్.. 2018 మూవీ రివ్యూ


1924 తర్వాత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు 2018లో కేరళలో వస్తాయి. ఆ వరద బీభత్సం నేపథంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో ఒకరి పాత్ర అంటే ఉండదు. ప్రతి ఒక్కరు హీరోలాగే ఉంటారు. ఆర్మీలో ఉండలేక ప్రాణ భయంతో సైన్యం నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు.. సముద్రంలో చేపలు పట్టుకునే ఒక కుటుంబం.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి.. పని ఒత్తిడిలో బడి దేశంలో ఉంటూ భార్యకు దూరమైన ఒక భర్త ఆవేదన..

మూవీ రివ్యూ: 2018

నటీనటులు: టొవినో థామస్, లాల్, అసిఫ్ అలీ, నరేన్, కుంచుకో బోబన్, కలై అరసన్, తన్వి, రామ్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్ తదితరులు

సంగీతం: నోబిన్ పాల్

సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్

నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి-సీకే పద్మకుమార్-ఆంటో జోసెఫ్

కథ-కథనం-దర్శకత్వం: జూడ్ ఆంటోనీ జోసెఫ్

2018.. ఈమధ్య ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా తెలుగులో ఈ సినిమా విడుదలైంది. మరి ఇక్కడ కూడా 2018కి అదే రెస్పాన్స్ వచ్చిందా లేదా..

Advertisement

కథ:

1924 తర్వాత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు 2018లో కేరళలో వస్తాయి. ఆ వరద బీభత్సం నేపథంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో ఒకరి పాత్ర అంటే ఉండదు. ప్రతి ఒక్కరు హీరోలాగే ఉంటారు. ఆర్మీలో ఉండలేక ప్రాణ భయంతో సైన్యం నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు.. సముద్రంలో చేపలు పట్టుకునే ఒక కుటుంబం.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి.. పని ఒత్తిడిలో బడి దేశంలో ఉంటూ భార్యకు దూరమైన ఒక భర్త ఆవేదన.. పర్యాటకుల కోసం ట్యాక్సీ నడిపే ఒక డ్రైవర్.. తమిళనాడు నుంచి కేరళకు పేలుడు పదార్థాలు తీసుకొస్తున్న ఒక ట్రక్ డ్రైవర్.. ఇలా పలువురు కేరళ వరదల్లో చిక్కుకుంటారు. మీకు అందరూ వరద బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు సినిమా కథ..

కథనం:

కొన్ని సినిమాలు చూడడానికి నటులతో పరిచయం అవసరం లేదు. కథతో కనెక్ట్ అయితే చాలు.. ఎమోషన్స్ అలా వర్కవుట్ అవుతాయి. 2018 అచ్చంగా ఇలాంటి సినిమానే. మన భాష కాదు.. కష్టం మన రాష్ట్రానిది కాదు.. కానీ తెరమీద జనం పడే కష్టం చూసి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేంత ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. ఈ విషయంలో దర్శకుడు జ్యుడో థామస్ కు నూటికి నూరు మార్కులు వేయవచ్చు. ఫస్టాఫ్ అంతా కథను సరిగ్గా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. కీలకమైన సెకండ్ హాఫ్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా రెండు మూడు సన్నివేశాలు అయితే మనసుకు హత్తుకుంటాయి. సెకండ్ హాఫ్ లో హీరో ఒక కుటుంబాన్ని కాపాడే సన్నివేశం.. ప్రజలను కాపాడడానికి మత్స్యకారులు బోట్లు తీసుకొచ్చే సన్నివేశం.. 2018 సినిమాకు ప్రేక్షకులు ఎందుకంత కనెక్ట్ అవుతున్నారో ఈ సీన్స్ చూస్తే అర్థమవుతుంది. హ్యూమన్ ఎమోషన్స్ కు పెద్దపీట వేశాడు దర్శకుడు.. Everyone is a hero అనే క్యాప్షన్ సినిమాకు పక్కాగా సూట్ అవుతుంది. చివరి అరగంట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క సన్నివేశం ఒళ్ళు గగ్గుర పొడిచే విధంగా ఉంటుంది.

నటీనటులు:

టోవినో థామస్, కుంచికో బోబన్, నరైన్, లాల్, అపర్ణ బాలమురళి.. అందరూ మలయాళంలో చాలా పెద్ద నటులు. అందులో కొందరు హీరోలు కూడా ఉన్నారు. అయినా కూడా ఒక మంచి కథ కోసం అందరూ కలిసి నటించారు. ఎవరికి వాళ్లే తమ పాత్రల్లో జీవించారు.

టెక్నికల్ టీమ్:

ఈ సినిమాకు మరో హీరో టెక్నీషియన్స్. సౌండింగ్ అండ్ విజువల్స్ అయితే అద్భుతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. దర్శకుడు జ్యూడో థామస్ వర్క్ అద్బుతం. ఈ సినిమాని చూడడానికి థియేటర్ వరకు వెళ్తారో లేదు తెలియదు కానీ..
వెళ్తే మాత్రం కచ్చితంగా గుర్తుండిపోతుంది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా 2018.. హైలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button