Entertainment: రణ్‌బీర్ తో బాలయ్య సందడి.| మేకింగ్ ఆఫ్ మంగళవారం అదిరిపోయే విజువల్స్.
అన్‌స్టాపబుల్: ఆహాలో వస్తున్న సెన్సేషనల్ ఓటిటి టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ షోకు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వచ్చారు.
యానిమల్ టీం ఈ షోకు వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైపోయింది. ఈ ఎపిసోడ్‌ను నవంబర్ 24న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది.
సంక్రాంతికి క్రిస్మస్: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న సినిమా మేరీ క్రిస్మస్. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ చిత్ర రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది. జనవరి 12న మేరీ క్రిస్మస్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నిజానికి ఈ డిసెంబర్లో క్రిస్మస్ పండగ సమయంలోనే విడుదల చేయాలనుకున్నా.. చివరికి సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసారు.
మేకింగ్ ఆఫ్ మంగళవారం: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మంగళవారం. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం ఎంతగా ఎఫర్ట్స్ పెట్టారనేది ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు అజయ్ భూపతి.
రాజు యాదవ్ రొమాన్స్..: కమెడియన్‌గా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా మారిపోయారు. కృష్ణమాచారి దర్శకత్వంలో గెటప్ శ్రీను హీరోగా రూపొందుతున్న సినిమా ‘రాజు యాదవ్’. తాజాగా ఈ సినిమాలోని చూడు చూడు అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
అభయ్ వస్తున్నాడు..: కమల్ హాసన్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆళవంధన్ అప్పట్లో డిజాస్టర్ అయింది కానీ కమల్ కెరీర్లో మాత్రం క్లాసిక్‌గా నిలిచింది. అదే తెలుగులో అభయ్ పేరుతో వచ్చింది. 2001లో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.