News

Tollywood: వెన్నెలకు వన్నె తెచ్చే అందాల బాల.. సొగసుల సాగరంలో ఎగసిపడే అల.. ఇంతకీ ఎవరీ నెరజాణ? | Dhamaka Actress Sree Leela Childhood Photos Goes Viral On Social Media


పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని చూశారా.? ఈమె ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. కన్నడ కస్తూరి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే..

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని చూశారా.? ఈమె ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. కన్నడ కస్తూరి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయితేనేం. ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్ అందుకోవడమే కాదు.. కుర్రాళ్ల హార్ట్‌త్రోబ్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ పోతినేని సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా రవితేజతో నటించి బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అందుకుంది. ఆమెవరో గుర్తుపట్టారా.?

మీరు ఇంకా కనిపెట్టలేదా.? అయితే మేమే చెప్పేస్తున్నాం.. మరెవరో కాదు హీరోయిన్ శ్రీలీల. 2019లో ‘కిస్’మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో దూసుకుపోయింది. ఇక తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’తో పరిచయమైన శ్రీలీల.. ఆ తర్వాత రవితేజతో ‘ధమాకా’తో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో 4 చిత్రాల్లో నటిస్తోంది. ఆమె అందం, అమాయకత్వం, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు కుర్రకారు ఈమే కలల రాణి అని చెప్పొచ్చు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button