News

Tollywood : మూవీ లవర్స్‌కు పండగే.. ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు 9 సినిమాలు.. అవేంటంటే


నవంబర్ మొదటి వారంలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో చిన్న మీడియం రేంజు సినిమాలు ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

టాలీవుడ్ లో ఈ మధ్య వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలతో పాటు ధియేటర్స్ లోను సినిమాలు సందడి చేస్తున్నాయి. దీపావళికి సినిమాల జోరు పెద్ద కనిపించకపోయినప్పటికీ నవంబర్ లో మాత్రం గట్టిగానే సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో చిన్న మీడియం రేంజు సినిమాలు ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ పది సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో ఎనిమిది స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఉండగా రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమా లపై ఇప్పటికే మంచి బజ్ కూడా ఏర్పడింది. ఈ మధ్య కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయిన సంచలన హిట్ గా నిలుస్తున్నాయి. అటు డబ్బింగ్ సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన కాంతారా సినిమా దానికి ఉదాహరణ..

ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న పది సినిమాల్లో అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న ఉర్వశివో రాక్షసీవో ఒకటి. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక అదే రోజు నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది . ఈ సినిమాలో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నవంబర్ 4నే నవీన్ చంద్ర నటించిన తగ్గేదే లే అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీటితో పాటు – సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ సినిమా కూడా నవంబర్ 4నే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా వెరైటీగా జరిపారు చిత్రయూనిట్. ఇక వీటితో పాటు ‘సారధి’ ‘జెట్టి’ ‘చింతామణి సొంత మొగుడు’  సినిమాలు రిలీజ్ అవుతున్నాయిఅలాగే  ‘ఆకాశం’ ‘బనారస్’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరావు నటించి అలనాటి ఆణిముత్యం ప్రతిబింబాలు సినిమా కూడా రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా వచ్చి ఇప్పటికే  40 ఏళ్ల  దాటింది. ‘ప్రతిబింబాలు’ సినిమా నవంబర్ 5న విడుదల కాబోతోంది. ఇలా రెండు రోజుల్లో పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button