News

Tollywood: అందాల తార శ్రీదేవితో ఉన్న ఈ చిన్నారి కూడా తెలుగు‏లో స్టార్ హీరోయిన్.. కనిపెట్టగలరా..? – Telugu News | Guess the Child actress turned star heroine in this throwback picture with Sridevi


పైన ఫొటోలో అందాల తార శ్రీదేవితో ఉన్న ఈ చిన్నారి కూడా తెలుగులో స్టార్​ హీరోయిన్‌గా చక్రం తిప్పింది​. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలయ్యం వంటి స్టార్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఇంతకీ ఆ పాప ఎవరంటే..?

ఎవరివైనా సరే.. చిన్ననాటి ఫోటోలు ఎంతో అమూల్యమైనది. ఆ సమయంలో ఎవరి మనసుల్లో కల్మషం ఉండదు. అదే  స్వచ్చత ఫోటోల్లో కూడా కనిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. వాటిని అదే పనిగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మీ ముందుకు ఓ నటీమని చైల్డ్‌హుడ్ ఫోటోను తీసుకొచ్చాం. అది కూడా బయట దిగింది కాదండోయ్. సినిమాలోని. అందాల తార శ్రీదేవితో ఉన్న ఈ పాప ఎవరో మీరు గుర్తుపట్టారా..? తను కూడా తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా రాణించింది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్ వంటి బడా స్టార్లతో ఆడిపాడింది. ఇప్పడు సీనియర్ హీరోల సరసన సెలక్టివ్ రోల్స్ చేస్తుంది. పోలికల ద్వారా కొందరైతే గుర్తుపట్టి ఉంటారు..? కనిపెట్టలేని వారు డోంట్ వర్రీ. మేమే రివీల్ చేయబోతున్నాం.

తను సీనియర్ హీరోయిన్ మీనా. సౌత్ ఆడియెన్స్‌కు మీనాను స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మీనా.. ఆ తర్వాత కాలంలో హీరోయిన్‌గా చక్రం తిప్పింది. టాప్ స్టార్స్ అందరితో నటించింది. టాలీవుడ్‌తో పాటు కోలివుడ్‌లో 1991 నుంచి 2000 వరకు.. సుమారు ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ముఖ్యంగా వెంకటేష్‌తో ఎక్కువ హిట్స్ అందుకుంది. ఆయనతో నటించిన  ‘సుందర కాండ’, ‘చంటి’, ‘సూర్య వంశం’, ‘అబ్బాయిగారు’ వంటి మూవీస్ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. బాలయ్యతో.. ‘బొబ్బిలి సింహం’, . ‘ముద్దుల మొగుడు’.. చిరంజీవితో  ‘స్నేహం కోసం’, ‘శ్రీ మంజునాథ’, ముఠా మేస్త్రి’ సినిమాలు చేసింది మీనా. ఇటీవలి కాలంలో దృశ్యం సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.

2009లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌తో మీనా పెళ్లాడింది. వీరికి నైనికా అనే తనయ ఉంది. తెలుగులో ‘పోలీసోడు’ సినిమాతో మీనా కూతురు కూడా  చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అయితే గత ఏడాది జూన్ 28న చెన్నైలోని MGM ఆసుపత్రిలో పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో మీనా భర్త కన్నుమూశారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మీనా.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button