News

Tollywod: వారెవ్వా.. అన్‌సీజన్‌ను అలా వాడేస్తున్న రవితేజ, సమంత.. సూపర్ ప్లాన్‌గా | Raviteja Samantha Planned to use the gap after dasara Dhamaka Shakuntalam


అక్టోబర్ 21న రవితేజ ధమాకా రాబోతుందని తెలుస్తుంది. అక్టోబర్ 24న దివాళి ఉండటంతో.. మూడు రోజుల ముందే పండగ చేసుకోవాలని చూస్తున్నారు మాస్ రాజా.

అంతా దసరా సీజన్‌పై కాన్సట్రేట్ చేస్తున్నారు కానీ ఆ తర్వాత వచ్చే సినిమాల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే దసరా సీజన్ అయిపోయాక.. కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రవితేజ(Raviteja), సమంత(Samantha) లాంటి స్టార్స్ ఉన్నారు. మరి అక్టోబర్ రెండో వారం నుంచి నవంబర్ వరకు రిలీజ్ కాబోయే సినిమాలేంటి..? అన్‌సీజన్‌ను క్యాష్ చేసుకునే సత్తా ఆ సినిమాలకు ఉందా..? అక్టోబర్ 5న దసరా సందర్భంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్‌లోనే సినీ జాతర జరగబోతుంది. ఈ నెలన్నర గ్యాప్‌లో రాబోయే సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే చాలా తెలివిగా రవితేజ, సమంత లాంటి స్టార్స్ ఈ అన్‌సీజన్‌లోనే వస్తున్నారు. అక్టోబర్ 21న రవితేజ ధమాకా(Dhamaka) రాబోతుందని తెలుస్తుంది. అక్టోబర్ 24న దివాళి(Diwali) ఉండటంతో.. మూడు రోజుల ముందే పండగ చేసుకోవాలని చూస్తున్నారు మాస్ రాజా.

Dhamaka

త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ధమాకా షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసారు మేకర్స్. శ్రీలీల ఇందులో హీరోయిన్. ఈ సినిమాను అక్టోబర్ మూడో వారంలో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నవంబర్ 4న సమంత శాకుంతలం సినిమాతో వచ్చేస్తున్నారు. ప్రేమకథాచిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత ఆయన చేస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు గుణశేఖర్. మొత్తానికి దసరా తర్వాత.. డిసెంబర్‌కు ముందు ధమాకా, శాకుంతలంపైనే అందరి చూపు ఉంది. మరి ఇవేం చేస్తాయో చూడాలి.

Samantha Shakuntalam

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button