News

Tirupati Acb Raids, తిరుపతి: క్లర్క్‌గా చేరి కోట్లకు పడగలెత్తి.. ప్రభుత్వ అధికారికి కళ్లు చెదిరే ఆస్తులు – acb raids on bc welfare dd yugandhar houses in tirupati


Tirupati Bc Welfare Dd Yugandhar తిరుపతిలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్‌ డీడీ యుగంధర్‌ అనంతపురం డీడీగా పనిచేస్తున్న సమయంలో ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అనంతపురం ఏసీబీ అధికారులు ఆరా తీస్తుండగానే ఆర్నెల్ల క్రితం యుగంధర్‌ తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్‌ డీడీగా వెళ్లారు. అనంతపురం ఏసీబీ అధికారులు గత డిసెంబరు 31న కేసు నమోదుచేశారు.. రాష్ట్రంలో ఏడుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి.

కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన యుగంధర్‌ 1999లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరి, పలు ఉద్యోగోన్నతులు పొంది ప్రస్తుతం తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. తిరుచానూరు సమీపంలోని యుగంధర్‌ నివాసంలో ఇళ్లలో సోదాలు చేశాయి. ఆయనపేర మొత్తం రూ.2.72 కోట్ల ఆస్తి ఉండగా.. రూ.1.84 కోట్ల విలువైనవి అక్రమ ఆస్తులుగా గుర్తించారు. అలాగే 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కిలోల వెండి వస్తువులు, కొంత డబ్బు సీజ్ చేశారు. యుగంధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అంతేకాదు యుగంధర్‌కు కాకినాడలో జీ ప్లస్‌ 2 ఇళ్లు, ఒక ఫ్లాట్‌, ఆరు ఇళ్ల స్థలాలు ఉన్నట్లు తేలింది. విజయవాడలో ఒక ఇంటి స్థలం, కాకినాడ మాధవపట్నం గ్రామంలో 0.54 ఎకరాల మాగాణి భూమి ఉందని చెబుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లా చెల్లూరు గ్రామంలో 1.94 సెంట్ల మాగాణి భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button