News

Tirupati: తిరుపతి ‘మాయ’ మంటల మిస్టరీ వీడింది.. అంతా ఆమే చేసిందంట..! – Telugu News | Fires in houses and fields in Tirupati mystery solved, a woman is behind it


తిరుపతి శానంబట్ల మంటల మిస్టరీ వీడింది. ఈ మంటల వెనుక మాయ లేడీ ఉందని తేల్చారు పోలీసులు. ఏఎస్పీ వెంకట రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఈ మంటల వెనుక మతలబు ఏంటో వివరించారు.

తిరుపతి శానంబట్ల మంటల మిస్టరీ వీడింది. ఈ మంటల వెనుక మాయ లేడీ ఉందని తేల్చారు పోలీసులు. ఏఎస్పీ వెంకట రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఈ మంటల వెనుక మతలబు ఏంటో వివరించారు. శానంబట్ల మంటలకు కీర్తి అనే యువతే ప్రధాన కారణం అని తేల్చారు. ఆ యువతే ఈ పని చేసిందని నిర్ధారించారు. తన తల్లి ప్రవర్తన నచ్చకనే యువతి ఆ పని చేసిందట. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి.. తల్లితో పాటు ఊరు వదిలి వెళ్లే అవకాశం వస్తుందని భావించి కీర్తి ఇలా చేసిందని గుర్తించారు పోలీసులు. తన తల్లి ప్రవర్తనలో మార్పు కోసమే ఇలా చేసిందట.

శానంబట్లలో మొత్తం 12 అగ్ని ప్రమాద ఘటనలకు పాల్పడింది కీర్తి. అంతేకాదు.. గ్రామంలోని కొందరితో ఉన్న గోడవల కారణంగా వారి ఇళ్లల్లోనూ మంటలు పెట్టిందని గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికను చూస్తే.. మంటల వెనుక ఎలాంటి రసాయనాలు లేవని తేల్చారు. అయితే, కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించిందని ఏఎస్పీ వెల్లడించారు. అగ్గి పెట్టెతోనే తాను మంటలు పెట్టినట్లు ఒప్పుకుంది కీర్తి. ఆమె వద్ద నుంచి రూ. 32 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఏఎస్పీ. ఇందులో ఎలాంటి మూఢ నమ్మకాలు లేవని స్పష్టం చేశారు ఏఎస్పీ వెంకట్రావు.

చంద్రగిరి మండలంలోని ఒక గ్రామం శానంబట్ల. తిరుపతికి దాదాపు ఒక 15 కిలోమీటర్లు దూరంలో ఉండే గ్రామం. బాగా నాగరికత తెలిసిన గ్రామం. అయితే అక్కడ ఉన్నట్లుండి మంటలు రావడంతో అందరూ అవాక్కయ్యారు. అధికారులు సైతం విస్తుపోయారు. అసలేం జరుగుతుందో తెలియక జుట్టుపీక్కున్నారు. దెబ్బకు గ్రామంలో గ్రామంలో మంత్రగాళ్ల హడావుడి, పూజలు, బలులు ఇవ్వడం మొదలైంది. ఇవేవీ మంటల రహస్యాన్ని తేల్చలేకపోయాయి. చివరకు పోలీసులకు వచ్చిన చిన్న డౌట్‌తో.. మ్యాటర్ క్లియర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button