News

Tirumala Rooms Rentals Hiked, తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. వసతి గదుల అద్దె పెంపు, ఎంతంటే! – tirumala rooms rentals prices hiked


తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) సడన్ ట్విస్ట్ ఇచ్చింది. కొండపై ఆధునికీకరణ పనులు చేపట్టి.. మళ్లీ అందుబాటులోకి వచ్చిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. రూ.500, రూ.600 నుంచి రూ.1000కు వరకు ఆయా గదులను బట్టి ధర పెరిగింది. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు.

అలాగే కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దె జీఎస్టీతో కలిపి రూ.2800కు పెరిగింది. భక్తులు గదుల అద్దెతోపాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. గదిని రూ.1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరల పెరుగుదలపై శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది.

ఇటు రూ.50 అద్దెతో లభించే ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, హెచ్‌వీసీ, ఏఎన్‌సీ.. రూ.100 అద్దెతో అందించే సప్తగిరి, వరాహస్వామి గెస్ట్‌హౌస్‌, రాంభగీచా, ఎస్‌ఎన్‌జీహెచ్‌, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీఅతిథిగృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. వీటి అద్దెలు కూడా పెంచుతారా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. తిరుమలలో వసతి కేంద్రాలను రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేశారు. ఏసీ, గీజర్‌ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచారు. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

మరోవైపు జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి కోటా (ఫిబ్రవరి 1 నుంచి 22)కు సంబంధించి టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను ఈ నెల 7న ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ ప్రత్యేక దర్శన స్లాట్లకు సంబంధించిన గదుల బుకింగ్ ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 2 నుంచి 11 వరకు అందుకు సంబంధించిన టికెట్లు జారీ చేసింది టీటీడీ.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button