News

Tirumala Ghat Roads Rock Bolting,తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ పెద్ద సమస్యకు పరిష్కారం! – ttd rock bolting work in tirumala ghat roads


తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తుల రక్షణ కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శేషాచలం అటవీప్రాంతం నుంచి వెళ్లే తిరుమల ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా.. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మద్రాస్‌ ఐఐటీ, ఇతర ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు ఘాట్‌రోడ్లలో కొండరాళ్లు జారిపడే ప్రాంతాలను గుర్తించి ఇచ్చిన సూచనలకు అనుగుణంగా పనులు చేస్తున్నారు.

రాక్‌ బోల్టింగ్‌, సంబంధిత పనులను శరత్‌చంద్ర కన్‌స్ట్రక్షన్స్‌ అనే కంపెనీ నిర్వహిస్తోంది. ఎత్తైన కొండలు ఉన్న ప్రదేశాల్లో ఫెన్సింగ్‌, రాక్‌బోల్టింగ్‌ చేస్తున్నారు. తక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో ఫెన్సింగ్‌లో నింపిన కొండరాళ్లతో అడ్డుగా గోడలా పెట్టి బండరాళ్లు, మట్టి జారకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా టీటీడీ ఈ చర్యలు తీసుకున్నారు.

సెప్టెంబ‌రు 15న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ‌

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 15న శుక్ర‌వారం శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ జ‌రుగ‌నుంది. శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున ఆల‌యంలో లక్ష కుంకుమార్చన సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇందులో భాగంగా ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహవ‌చ‌నం, ఉద‌యం 7 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ల‌క్ష‌కుంకుమార్చన నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామి, శ్రీ మ‌నోన్మ‌ణి అమ్మ‌వారి వీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

తిరుప్పావై ప్ర‌వ‌చ‌న కర్తల నుండి అంగీకార‌ప‌త్రాలకు ‌ ఆహ్వానం

పవిత్రమైన ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చెప్పేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను టీటీడీ ఆహ్వానిస్తోంది. 2015 నుండి 2023వ సంవ‌త్స‌రం వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చెప్పిన వారు ఈ సంవ‌త్స‌రం కూడా అంగీకారం తెల‌పాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

హిందూ ధార్మిక ప్రాజెక్టుల‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు అక్టోబ‌రు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502” అనే చిరునామాకు తమ అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. న‌మూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌డ‌మైన‌ది. ఇతర వివరాలకు టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయాన్ని 9676120226, 8978734947 నంబర్ల‌ను కార్యాల‌య వేళ‌ల్లో సంప్రదించగలరు.

  • Read More Andhra Pradesh News And Telugu News

Advertisement

Related Articles

Back to top button