News

tirumala devotee rs 5 crore donation, తిరుమల శ్రీవారికి భక్తుడి కళ్లు చెదిరే విరాళం.. ఏకంగా రూ.కోట్లలో – unknown devotee donates rs 5 crores to ttd trusts


తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీగా విరాళం అందజేశారు. టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు ఏకంగా రూ.5 కోట్లు విరాళంగా అందించారు. ఓ అజ్ఞాత భక్తుడు ఈ విరాళాల చెక్‌లను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని అధికారులను కోరారు. కానీ తన వివరాలు తెలిపేందుకు దాత అంగీకరించలేదు. ఆ భక్తుడిని టీటీడీ అభినందించింది.. అలాగే తన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవడం విశేషం.

ఇదిలా ఉంటే మరోసారి తిరుమలలో విమానం చక్కర్లు కొట్టింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయ సమీపంలోని అన్నదాన భవనం పైనుంచి విమానం వెళ్లగా టీటీడీ భద్రతాధికారులు.. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. అలాగే గురువారం కూడా తిరుమల గగనతలం పైనుంచి నాలుగు విమానాలు వెళ్లిన సంగిత తెలిసిందే. అయితే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదంటున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 74వేల 502మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 38,052మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి హుండీ కానుకలు రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఏటీసీ వరకు క్యూ లైన్ ఉంది. సర్వ దర్శనం టికెట్ లేని భక్తుల దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది.

ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా జూనియర్ క‌ళాశాలలో ‘ఇంటరాక్షన్ విత్ రజిని’

మరోవైపు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా జూనియర్ క‌ళాశాల‌ విద్యార్థుల‌తో ‘ఇంటరాక్షన్ విత్ రజిని’ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజిని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి ద‌శ‌లోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాల‌ని.. విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదన్నారు. తాను తిరుపతిలోనే చదివి నిరంతర శ్రమతో అనేక పరాజ‌యాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజ‌యం సాధించాన‌ని చెప్పారు రజిని. శ్రీ వేంక‌టేశ్వర స్వామి దయతో తాను ఈ స్థాయికి చేరుకోగలిగాన‌న్నారు.

జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయ‌కుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని చెప్పారు. తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన విధానాన్ని హాకీలోని మెలకువలను, క్రీడల వల్ల లభించే కీర్తి ప్రతిష్టలను, ఉన్నత ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాల‌ని చెప్పారు డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి . జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ చెందకూడదన్నారు . అకుంఠిత దీక్ష, శ్రమతో ఎంత‌టి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చ‌న్నారు. విద్యార్థులకు టీటీడీ అందించే సౌకర్యాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button