News
tirumala, తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి: టీటీడీ – ttd comments on hanuma jayanthi festival in tirumala
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు మే 14వ తేదీన పాపనాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి..
మరోవైపు హనుమజ్జయంతి రోజైన మే 14వ తేదీన పాపనాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆకాశగంగ, పాపనాశనం ప్రాంతాల వద్ద పార్కింగ్ సమస్య ఉంటుందని.. అందుకే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు గమనించి, సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.