News

Tiny glowing fish: ఏలియన్‌ చేపలు..! గడ్డకట్టే మంచులో మెరుస్తూ శాస్త్రవేత్తలకే షాక్‌.. ఎక్కడంటే.. | Tiny glowing fish is full of antifreeze to help it survive Greenland’s icy waters Telugu News


ఈ చేపలు వెరీ వెరీ స్పెషల్‌.. అప్పుడప్పుడు జాలర్ల వలలకు వింత వింత చేపలు పడుతుంటాయి. అప్పుడు ఆ జాలర్లు పడే ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే, ఇక్కడ కూడా అలాంటి వింత చేపల్ని కనుగోన్నారు శాస్త్రవేత్తలు.

Tiny glowing fish: చేపలందు ఇలాంటి చేపలు వేరయా అనాల్సిందే? ఎందుకుంటే.. ఇవి వెరీ వెరీ స్పెషల్‌.. అప్పుడప్పుడు జాలర్ల వలలకు వింత వింత చేపలు పడుతుంటాయి. అప్పుడు ఆ జాలర్లు పడే ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే, ఇక్కడ కూడా అలాంటి వింత చేపల్ని కనుగోన్నారు శాస్త్రవేత్తలు. పూర్తిగా మంచు సముద్రాల్లో నివసించగలిగే ఈ విచిత్ర చేపలు ఏలియన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. అందమైన రంగు రంగులతో మిరిమిట్లుతున్న ఈ చేపల్ని అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌లు ఆర్కిటిక్ మంచుకొండలో గుర్తించారు. ఈ కొత్త జాతి చేపలు పూర్తిగా మంచుమ‌య‌మైన గ్రీన్‌ల్యాండ్ స‌ముద్ర నీటిలో ఆకుపచ్చగా మెరుస్తున్న దాని శ‌రీరం, అంత చ‌ల్ల‌ని నీటిలో మ‌న‌గ‌లిగే దాని సామర్థ్యాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. వాటి ఆకారం, రూపం చూపం వారిని ఎంతగానో ఆకర్షించాయి.

ఈ ప‌రిశోధ‌న‌లో వివిధ రకాల నత్త చేపలను కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ వింత చేప‌ను మాత్రం “ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్-లుకింగ్” గా అభివర్ణించారు. ఏలియ‌న్ జీవిలా క‌నిపించే వాటి రక్తంలో ఉన్న యాంటీ-ఫ్రీజ్ ప్రోటీన్లు వాటిని మంచు నీటిలో ప్రకాశవంతంగా, ఆకుపచ్చగా మెరిసేట‌ట్లు చేస్తున్నాయ‌ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వెలుగు వ‌ల్ల వాటి శ‌రీరంలో వేడి పుట్టి, అవి చ‌ల్ల‌టి నీటిలో బ‌తక‌గ‌లుగుతున్న‌ట్లు తెలిపారు. అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో రీసెర్చ్ అసోసియేట్, సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ బరూచ్ కాలేజీలో జీవశాస్త్రగా ఉన్న‌ ప్రొఫెసర్ డేవిడ్ గ్రూబెర్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button