thummala nageswara rao, తుమ్మల ఇంటికి హరీష్ రావు.. ఆ ఎమ్మెల్యేతో కలిసి, ఖమ్మంలో ఆసక్తికర పరిణామం – harish rao meets thummala nageswara rao in khammam along with sandra venkata veeraiah
నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి హరీష్ రావు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్తూ.. మార్గమధ్యలో సత్తుపల్లిలో ఆగి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కలుపుకుని వెళ్లారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని అడ్డంపెట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తుమ్మలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు స్వయంగా సండ్ర వెంకటవీరయ్యను తుమ్మల నివాసానికి తీసుకువెళ్లడం ఆసక్తికరంగా మారింది.
గురువారం (జనవరి 12) కొత్తగూడెంలో, జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహించనుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న సభలు కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే ఈ సభలకు 5 లక్షల మందిని తరలించేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.