News

thopudurthi prakash reddy, మీరు గెలవాలంటే నన్ను చంపాలి: పరిటాల ఫ్యామిలీకి వైసీపీ ఎమ్మెల్యే ఆల్ ది బెస్ట్! – ysrcp mla thopudurthi prakash reddy serious comments on paritala sunitha


రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ గెలవాలంటే తననైనా చంపాలి లేదంటే తన క్యారెక్టరైనా చంపాలని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా కరువు కాటకాలే కనిపించేవన్నారు.

ఈరోజున రాప్తాడులో కరువు కాటకాలులేవని, చెరువుల నిండా నీళ్లు.. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోందని ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు. రాప్తాడులో గత 30 ఏళ్లుగా పరిటాల కుటుంబం రాజ్యమేలుతున్న తరుణంలో కరువుతో వేలాది మంది రైతులు వలసలు వెళ్లారని ఆరోపించారు. పేరూరు ఆయకట్టు గ్రామాలన్నింటికీ పిల్లకాలవల డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లిచ్చామని.. అందుకే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పేరూరు డ్యాంకు తాము ఎలా నీళ్లు తీసుకుని వచ్చింది జిల్లా ప్రజలకు తెలుసన్నారు.

●కల్లున్న కబోదులు చంద్రబాబు, రామకృష్ణ, సోమువీర్రాజు..! ●గుడ్ విల్ ఇవ్వనికారణంగా జాకీ కంపెనీ సేలం తరలివెళ్లినట్లు 2018…

Posted by Thopudurthi Prakash Reddy on Wednesday, November 23, 2022


నియోజకవర్గంలో 27 వేల ఇళ్లు మంజూరు చేయించానని.. వచ్చే ఎన్నికల్లోపు 20 వేల ఇళ్ల నిర్మాణాలు చేస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. 10 వేల మంది పాడి మహిళా రైతులకు డెయిరీ నిర్మిస్తున్నానని.. రైతులకు ఉచితంగా 6 వేల బోర్లు వేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో బోర్లు వేస్తున్నారని పరిటాల సునీత అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమ్మా.. మీరు ఏదైనా చేసి ఉంటే చెప్పుకోవాలని సవాల్ విసిరారు. పరిటాల ఫ్యామిలీ దొంగ చెక్కులు ఇస్తే తాము డబ్బులు ఇచ్చామని.. వాళ్లు బలవంతంగా భూములు లాక్కుంటే తాము భరోసా ఇచ్చామని వెల్లడించారు.

వాళ్లు ఇళ్లు కూల్చేస్తే.. తాము ఇళ్లు కట్టించి ఇస్తున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. గతంలో పరిటాల ఫ్యామిలీ ప్రజాకంఠక వైఖరి, దోపిడీ వల్ల, వాళ్లు సాగించిన దౌర్జన్యాల వల్ల అణిచివేతకు గురైన ప్రజలు తిరగబడ్డారన్నారు. మరూరు చెర్లోపల్లిలో పరిటాల శ్రీరామ్ మీద తిరగబడడ్డారని.. పరిటాల సునీత తమ్ముడిపై గొందిరెడ్డిపల్లిలో రాళ్లు రువ్వారని వ్యాఖ్యానించారు.

తోపుదుర్తిలో పరిటాల సునీతపైన చెప్పులు విసిరారని.. ఆమె కొడుకు కాన్వాయ్ మీద రాళ్లు వేశారని.. అలాంటి తిరుగుబాటు మళ్లీ రాకూడదనే వాళ్లు జనాల్లోకి వస్తుంటే పోసులతో రక్షణ కల్పించామని అన్నారు. ‘‘రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టరైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్, థాంక్యూ..!’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు.Advertisement

Related Articles

Back to top button