News

this week movies, ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. – theatres ott release movies in this week krishna vrinda vihari alluri dongalunnaru jagratha babli bouncer


దసరా పర్వదినం ముందు వారం థియేటర్స్‌లో సందడి చేసేందుకు పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. వచ్చే వారం పెద్ద హీరోల సినిమాలు ఉండడంతో.. దసరాకు ముందుగానే ఆడియన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాయి. గత వారం బాక్సాఫీసు వద్ద సందడి చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘శాకిని డాకిని’ తదితర చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ వారం థియేటర్స్, ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై ఓ లుక్కేద్దాం..

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్య.. ఈ మూవీ ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ఆడియన్స్‌ను పలకరించనుంది. అనీశ్‌ ఆర్‌ కృష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షెర్లీ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.

శ్రీవిష్ణు (Sree Vishnu) తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ (Alluri). ప్రదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేయనుంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించగా.. తనికెళ్ల భరణి, సుమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కిన మూవీ దొంగలున్నారు జాగ్రత్త. సతీష్‌ త్రిపుర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్స్‌లో సందడి చేయనుంది. కారు దొంగతనం చేసేందుకు వెళ్లి.. అందులోనే హీరో ఇరుక్కుపోయి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే పాయింట్ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సముద్రఖని కీలక పాత్రలో నటించాడు.

సీనియర్ నటి సుధ టైటిల్ రోల్‌లో నటించిన మూవీ ‘మాతృదేవోభవ’. ఫ్యామిలీ సబ్జెక్టుతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్స్‌ ముందుకు రానుంది. సుమన్, చమ్మక్‌ చంద్ర, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కె.హరనాథ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయసూర్య మ్యూజిక్ అందించారు.

నెట్‌ఫ్లిక్స్‌‌లో సెప్టెంబరు 21 నుంచి ద పెర్‌ఫ్యూమర్‌ అనే హాలీవుడ్‌ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబరు 23న జంతరా అనే హిందీ సిరీస్‌‌తో పాటు ఎల్‌వోయూ హాలీవుడ్‌ అనే సినిమా అందుబాటులోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌‌లో సెప్టెంబరు 21న అందోర్‌ అనే వెబ్‌సిరీస్‌, సెప్టెంబరు 22న ద కర్దాషియన్స్‌ వెబ్‌సిరీస్‌-2 స్ట్రీమింగ్ కానున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్‌ మూవీ సెప్టెంబరు 23న నేరుగా డిస్నీ+హాట్‌స్టార్‌‌లో రిలీజ్ కానుంది. ఆహాలో సెప్టెంబరు 23 నుంచి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మూవీ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో డ్యూడ్‌ అనే హిందీ సిరీస్‌ సెప్టెంబరు 20 నుంచి అందుబాటులో ఉండనుంది.

Related Articles

Back to top button