The Kerala Story: బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం.. 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లిన ది కేరళ స్టోరీ – Telugu News | The Kerala Story Box Office Collection Day 8: Adah Sharma’s film edges closer to Rs 100 crore club
సరదాగా సినిమాలకే మాటలొచ్చాయనుకోండి.. అహా ఓసారలా అనుకోండి..! అప్పుడు హిట్టైన చిన్న సినిమాలపై.. భారీ అంచనాలతో వచ్చి ఫ్లాపైన పెద్ద సినిమాల ఫీలింగ్ ఏంటో తెలుసా..? నువ్వేంటి.. నీ బడ్జెట్ ఏంటి.. ఆ కలెక్షన్స్ ఏంటి.. ఎక్కడైనా పోలికుందా అసలు..? అచ్చం ఇలాగే ఉంటుంది. కొన్ని సినిమాల్ని చూస్తే ఇదే అనిపిస్తుందిప్పుడు. కేరళ స్టోరీ కూడా ఈ లిస్టులో జాయిన్ అయిపోయింది.
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన పనిలేదు.. ఖలేజా కోసం త్రివిక్రమ్ చాలా గొప్ప మాట రాసారు. అది ఆ సినిమాకు వర్కవుట్ అవ్వలేదు కానీ.. ఇప్పుడు కొన్ని సినిమాలకు మాత్రం ఈ మాట బాగా సరిపోతుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి వందల కోట్లు వసూలు చేస్తున్నాయవి. ది కేరళ స్టోరీ సైతం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. వివాదాలే కేంద్రంగా మే 5న విడుదలైన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ కచ్చితంగా 250 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది.
తమిళనాడు, కేరళ, వేస్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినా.. మిగిలిన చోట్ల బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. మే 13 నుంచి తెలుగులోనూ వచ్చింది కేరళ స్టోరీ. కేరళ స్టోరీ దూకుడు గతేడాది కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేయక మానదు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ సినిమా 17 కోట్లతో తెరకెక్కి.. 250 కోట్లు వసూలు చేసింది.
కాంతార సైతం ఇలాంటి సంచలనమే సృష్టించింది. కన్నడలో 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్లు వసూలు చేసి అబ్బురపరిచింది. అలాగే నిఖిల్ కార్తికేయ 2 సైతం 14 కోట్లతో తెరకెక్కిస్తే.. 130 కోట్లు వసూలు చేసింది. కొన్నేళ్లుగా ఇలాంటి వండర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.