News

Thalapathy Vijay: మంచి మనసు చాటుకున్న దళపతి విజయ్‌.. ఆ విద్యార్థులను ఘనంగా సన్మానించడంతో పాటు.. – Telugu News | Thalapathy Vijay to felicitate toppers of classes 10, 12 on June 17 in Chennai Telugu Cinema News


సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు హీరో విజయ్‌. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు విజయ్‌.

కోలీవుడ్ హీరో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది అభిమానులున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు హీరో విజయ్‌. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు విజయ్‌. ప్రతి నియోజకవర్గంలో ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఆయన సన్మానించనున్నారు. ఈనెల 17న చెన్నైలో జరిగే కార్యక్రమానికి ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, సన్మానంతో పాటు నగదు ప్రోత్సహకాలను కూడా విజయ్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.
ఈ మేరకు చెన్నై నీలగిరిలోని ఆర్‌కే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని సోషల్‌ మీడియా వేదికగా విజయ్ టీమ్‌ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది వారసుడు సినిమాతో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమాలో నటిస్తున్నారు. త్రిష విజయ్‌తో రొమాన్స్‌ చేయనుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంజయ్‌ దత్, అర్జున్‌, ప్రియా ఆనంద్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button