Entertainment

Viral: ఈ చిట్టి తల్లి ఎవరో గుర్తుపట్టారా..? 3 ఏళ్ల వయస్సు నుంచే మనసులు దోచేస్తున్న తెలుగు పిల్ల


ఇప్పుడు గాయనీమణిగా, నటిగా, వాణిజ్యవేత్తగా… ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఓ ప్రొగ్రాం హోస్ట్‌గా అనేక పాత్రలు పోషిస్తున్న ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

ఆమె వేయి వెలుగుల నిండు జాబిలి.. చీకటి వాకిట వేసిన వెన్నెల ముగ్గు. ఆమె ఎరుగని ఎత్తుల్లేవ్.. ఆమె ఎదగని ఎల్లల్లేవ్.. ఆమె ఎవరో కాదు మహిళ.  ఈ జగతిని నడిపించే సైన్యం విశ్వానికి శ్వాస.. సంపద.. సమస్తం.. ఆ మహిళకు నీరాజనం పలుకుతూ.. ఓ తెలుగు టాలెంటెడ్ మహిళ గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు.. స్మిత. స్మిత… గాయని, నర్తకి, ప్రయోక్త, నటి, వ్యాపారవేత్త…తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బమ్ సృష్టికర్త.

నాలుగేళ్ల వయసులోనే బెరుకు లేకుండా పాట పాడి బహుమతి సాధించారు స్మిత..ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే పాపులర్ ప్రోగ్రామ్ పాడుతా తీయగాలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. తన గొంతు పాప్ మ్యూజిక్‌కు సరిగ్గా సరిపోతుందని నిర్దారణకు వచ్చి.. తనకు తాను తీర్చిదిద్దుకుని హాయ్‌రబ్బా పేరుతో మ్యూజిక్ అల్బమ్ చేశారామె. తెలుగులో ఒక పాప్ మ్యూజిక్ ఆల్బమ్ చేయడం.. అది కూడా ఒక అమ్మాయి చేయడం.. అప్పట్లో పెను సంచలనం.. తర్వాత తెలుగు పాత పాటలను రీమిక్స్ చేసి ఎంతో పాపులర్ అయ్యారు స్మిత.

ఓ తెలుగు సినిమాలో తళుక్కున మెరిశారు. గాయనిగా.. తర్వాత ప్రయోక్తగా.. రియాల్టీ షో జడ్జీగా ఇప్పుడు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేసే ఒక సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్రెజెంటర్‌గా వున్నారు. ఇతరుల జీవితంలో కూడా మార్పు తేగలిగితే చాలా తృప్తిగా ఉంటుంది అని చెబుతూ ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఒక పని మొదలుపెడితే పూర్తయ్యే దాకా వదలరు ఆమె. సంకల్పం గట్టిగా ఉంటే- ఏదైనా జరిగిపోతుందని నమ్ముతారు. అందుకే స్మిత ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button