Entertainment

Tollywood: ఈ కుర్రోడు తెలుగులో మాంచి హీరో.. హార్ట్ కోర్ చిరు ఫ్యాన్ కూడా.. గుర్తుపట్టారా..?


Hero Childhood Photo

ఇప్పుడు చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్ లేని పర్సన్ ఉంటాడా చెప్పండి. అలానే నయా జనరేషన్ మొత్తం సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే టైమ్ అంతా గడిపేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులకు దగ్గరిగా ఉండేందుకు.. తమకు సంబంధించిన అప్ డేట్స్ షేర్ చేసేందుకు ఈ సోషల్ ప్లాట్ ఫామ్స్ బాగా యూజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా స్టార్స్ చిన్ననాటి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ ఫోటోను మీ ముందుకు పట్టుకొచ్చాం. పైన ఉన్న ఫోటో చూశారా.. అతను టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి హీరోగా రాణిస్తున్నాడు. పాత్ర నచ్చితే విలన్ వేషాలు కూడా వేస్తాడు. అంతేకాదు హార్డ్ కోర్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్.

ఏంటి ఏమైనా గుర్తుపట్టారా..? లేదా.. కొంచెం కష్టమేలేండి. ఇక మేమే చెప్పేస్తాం. ఆ అబ్బాయి ఎవరో కాదు.. ఆర్‌ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ ఫోటోలో పక్కన ఉంది అతని సిస్టర్.  ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన కార్తికేయ .. ఆ తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘RX100’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’, అజిత్ నటించిన ‘వాలిమై’ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తెలుగులో ‘హిప్పి’, ‘గుణ 369’, 90 ML, చావు కవురు చల్లగా, రాజా విక్రమార్క వంటి సినిమాలతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ప్రజంట్  ‘బెదురులంక 2012 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ బ్యాక్ టూ ఫామ్ అవ్వాలని ఆరాపడుతున్నాడు. లెట్స్ సీ.

 

View this post on Instagram

 

A post shared by Kartikeya (@actorkartikeya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisement

Related Articles

Back to top button