Entertainment

Viral: పత్తి తొక్కుతున్న ఈ పల్లెటూరి పిల్ల ఓ ఫేమస్ నటి.. ఎవరో మీరు గుర్తుపట్టారా..?


అరె ఈ అమ్మాయి భలే పత్తి తొక్కుతుందే.. అనుకుంటున్నారా..? పిల్ల బాగా కష్టపడేది అనుకుంట అని ప్రైజ్ చేస్తున్నారా..? తను ఓ ఫేమస్ నటి.. ఎవరో మీరు కనిపెట్టగలరా..?

నటీనటీలకు ఓ సౌలభ్యం ఉంటుంది. షూటింగ్ నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చు. అక్కడి అందమైన ప్లేసులు చూడొచ్చు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి కల్చర్ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇష్టం ఉంటే.. కాసేపు అక్కడి కల్చర్‌లో కూడా భాగం అవ్వొచ్చు. అలానే మన సెలబ్రిటీలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఓ నటి ఇటీవల మన తెలంగాణలోని కరీంనగర్‌ వెళ్లింది. అక్కడ కల్చర్ చూసి ఫిదా అయ్యింది. ఆ ప్రాంతంలోని స్పెషల్ వంటకాలు రుచి చూసి.. ఎగ్జైట్ అయ్యింది. అంతే కాదండోయ్ ట్రాక్టర్ తోలింది.. పొలం గట్లపై కూర్చుని పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేసింది. అన్నిటి కంటే స్పెషల్ ఏంటంటే.. బస్తాలోకి పత్తి తొక్కింది. అదే అండి మన ఏరియాల్లో పత్తి తొక్కుడు అంటారు కదా.. అది అన్నమాట. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా..?

లేదా.. ఎంత ట్రై చేసినా గుర్తించలేకపోతున్నారా..? మేమే చెప్పేస్తాం లెండి. ఎందుకంటే ఆమె ఎవరో చెప్పడం అంత ఈజీ ఏం కాదు. తన ఫేమస్ నటి ధన్య బాలకృష్ణ. కర్ణాటకకు చెందిన ధన్య.. తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. పలు సినిమాల్లో హీరోయిన్‌గానూ మెరిసింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ జగమే మాయ డిసెంబర్ 15 నుంచి.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఓ షూటింగ్ నిమిత్తం కరీంనగర్ వెళ్లిన ధన్య ఇలా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడయాలో పంచుకుని.. మురిసిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button