News

telangana rains, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఇవాళ అల్పపీడనం బలపడే ఛాన్స్! – heavy rainfall in telangana due to low pressure form in bay of bengal


తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొక అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు వర్షప్రభావంతో అల్లాడుతున్నారు. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అది స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ ఇవాళ సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అల్పపీడన ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. అల్పపీడన ప్రభావం ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలపై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

నిర్మల్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వరంగల్ తూర్పు జిల్లాలైన జయశంకర్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పోలవరం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం ఒడిశా నుంచి లోపలికి కదులుతుండటంతో ఆ ప్రభావం ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button