News
Telangana Rain Updates,Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు.. ఐఎండీ కీలక అప్డేట్ – imd said that there is no chance of heavy rains in telangana for another week
Telangana Rain Updates: పది రోజుల క్రితం వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కాస్త పొడి వాతావరణం ఏర్పడింది. తాజాగా.. తెలంగాణలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పింది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని వెల్లడించింది. పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో చలి వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణో్గ్రతలు 23 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఇక బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షం కురిసింది. కొద్దిసేపు కురిసినప్పటికీ వర్షం మాత్రం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నల్లకుంట, ముషిరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్క్, రామాంతపూర్, ఓయూ లింగంపల్లి, అంబర్ పేట్, విద్యా నగర్, మాదాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఈదుు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు.

ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయిన వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌లో 15.8 మి.మీ వర్షం కురిసింది. గుమ్మడిదలలో 13 మి.మీ, నల్లవల్లిలో 9.5 మి.మీ, కాగజ్‌మద్దూరులో 7.3 మి.మీ, ధర్మవరంలో 7.3 మి.మీ, అన్నాసాగర్‌లో 6.8 మి.మీ, హైదరాబాద్‌లో 4 మి.మి చొప్పున వర్షం కురిసినట్లు వాతావారణశాఖ అధికారులు తెలిపారు.
- Read More Telangana News And Telugu News