News

telangana corona, TS: కొత్తగా 992 కొవిడ్ కేసులు.. 6 వేలు దాటిన యాక్టివ్ కేసులు – 992 covid 19 cases reported in telangana in last 24 hours, total tally crosses 6000 mark


తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.. రాష్ట్రంలో కొత్తగా 992 కరోనా కేసులు (Telangana Corona Cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేల మార్క్ దాటింది. బుధవారం (ఆగస్టు 3) వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 6,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 227 మంది హాస్పిటళ్లలో అడ్మిట్ అయ్చారు. 37 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. 101 మంది ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్నారు. 852 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 41,182 నమూనాలను పరీక్షించగా.. ఇంకా 842 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. హుస్నాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా అలజడి రేపింది. పాఠశాలలో 20 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. మంగళవారం రోజూవారి కేసులు 1000 మార్క్ దాటిన విషయం తెలిసిందే. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికం ఉంటున్నాయి. అయితే, కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. మరణాలు మాత్రం సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..
బుధవారం (ఆగస్టు 3) కొత్తగా నమోదైన 992 కేసుల్లో హైదరాబాద్‌లో 376, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్‌లో 57, మేడ్చల్‌లో 54, నిజాబాబాద్ జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 37, ఖమ్మంలో 32, యాదాద్రి భువనగిరి జిల్లాలో 32, హన్మకొండలో 28, పెద్దపల్లి జిల్లాలో 26, మల్కాజిగిరి జిల్లాలో 21, మహబూబ్‌నగర్ జిల్లాలో 20, సిరిసిల్లలో 20, మహబూబాబాద్ జిల్లాలో 19, సంగారెడ్డిలో 19, సిద్దిపేటలో 18, ఆదిలాబాద్ జిల్లాలో 14, జనగామ జిల్లాలో 13, నారాయణపేట జిల్లాలో 12 కొవిడ్ కేసులు ఉన్నాయి.

బెడ్‌పై నుంచి పడి 9 నెలల బాలుడి మృతి

Related Articles

Back to top button