News

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్.. డైట్ చార్జీలు భారీగా పెంచాలని నిర్ణయం.. | Telangana Govt to increase diet charges for students in welfare hostels 


తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలను భారీగా పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలను భారీగా పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. 3 నుంచి 7వ తరగతి వారికి రూ.1200, 8 నుంచి 10వ తరగతి చదివే వారికి రూ.1400, ఇంటర్ విద్యార్థులకు 1,875 రూపాయల డైట్ చార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. దాదాపు 25 శాతానికిపైగా డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు.

సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీల పై బుధవారం ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఇప్పటివరకు ఇస్తున్న డైట్ ఛార్జీలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, అధికారుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకన్నా.. అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే ఉండాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచాలని మంత్రులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాలను పంపించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button