Telangana: రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు | Telangana government sanctions medical colleges in 8 districts
తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది.
Medical colleges: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అనుబంధ ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ప్రతి కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కొత్త కాలేజీ ఏర్పాటు కోసం రాజన్న సిరిసిల్లకు రూ.166కోట్లు, వికారాబాద్‌కు రూ.235కోట్లు, ఖమ్మానికి రూ.166కోట్లు, కామారెడ్డికి రూ.235కోట్లు, కరీంనగర్‌కు రూ.150కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి రూ.168కోట్లు, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌కు రూ.169కోట్లు, జనగామకు రూ.190కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. టోటల్‌గా 8 మెడికల్ కాలేజీల కోసం 1479 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది.
మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది ప్రభుత్వం. హాస్పిటల్ భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిఛర్ కొనుగోలు బాధ్యతను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. ఇక, ఆయా మెడికల్ కాలేజీలకు అటాచ్ చేస్తున్న హాస్పిటల్స్‌ను వైద్యవిధాన పరిషత్ పరిధి నుంచి డీఎంఈ అండర్‌లోకి ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే, ఆయా జిల్లాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయ్. ఇప్పటికే మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు ప్రారంభంకాగా, మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ఈ అకడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ కానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..