Telangana: అన్నకు పీసీసీ వద్దన్నారు.. కోమటరెడ్డి రాజగోపాల్‌పై షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్.. | Congress Leader Shabbir Ali Sensational Allegations on Komatireddy Rajagopal Reddy on Party Change
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై సంచలన కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ.
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై సంచలన కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. తన అన్న వెంకట్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని, ఇస్తే రేవంత్ రెడ్డికి, లేదంటే తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి తన ఇంటికి వచ్చి మరీ ఈ ప్రపోజల్ పెట్టాలని కోరినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. బుధవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఓ రోజు తన ఇంటికి వచ్చారని, పీసీసీ తనకు ఇచ్చేలా హైకమాండ్‌కు ప్రపోజల్ పంపాలని కోరారని చెప్పారు. వాళ్ల అన్న వెంకట్ రెడ్డికి పీసీసీ వద్దని అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి, లేదంటే తనకు ఇవ్వమన్నారని చెప్పారు. తానే ప్రత్యక్ష సాక్షిని అని, దమ్ముంటే ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పాలని సవాల్ విసిరారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడుస్తావా? అంటూ రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అమిత్ షాను చాలాసార్లు కలిశానని ఆయనే చెప్పారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. కాంట్రాక్టర్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డికి డిఫాల్టర్‌గా కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ఆరోపించారు. వాటి కోసమే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. ఏ రోజైనా మునుగోడు వెళ్లాడా? అని ప్రశ్నించారు. మనుగోడు అభివృద్ధి ఈ రోజు గుర్తొచ్చిందా? అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్‌ను విమర్శించే స్థాయి రాజగోపాల్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన్ను బొందపెడతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..