News

tekkali si, వైసీపీ ఎమ్మెల్సీ బర్త్ డేలో అమ్మాయిలతో కలిసి చిందులు.. టెక్కలి ఎస్సైపై వేటు! – police officers takes action on tekkali si


శ్రీకాకుళం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పుట్టినరోజు వేడుకల్లో జోరుగా డ్యాన్సులు వేసిన టెక్కలి ఎస్సైపై వేటుపడింది. బర్త్ డే సందర్భంగా టెక్కలిలోని వెంకటేశ్వర కాలనీలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళా డ్యాన్సర్లతో ఈ కార్యక్రమాన్ని దూంధాంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పోలీస్ శాఖకు చెందిన పలువురు కూడా పాల్గొన్నారు.

అయితే, టెక్కలి ఎస్సై హరికృష్ణ స్టేజీపై మహిళా డ్యాన్సర్లతో కలిసి సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతులతో కలిసి టెక్కలి ఎస్సై హరికృష్ణ నృత్యాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాలను ఆపాల్సిన ఎస్సై.. వారితో కలిసి డ్యాన్స్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దీంతో ఈ అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి టెక్కలి ఎస్సై హరికృష్ణపై వేటు వేశారు. ఎస్సై హరికృష్ణను వీఆర్‌కు పంపిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. టెక్కలి ఇన్‌ఛార్జ్ ఎస్సైగా నౌపడ ఎస్సై మహమ్మద్ అలీకి బాధ్యతలు అప్పగించారు.

Related Articles

Back to top button