News

Tattoos Record,World Record: కుమార్తెపై ప్రేమ.. టాటూలు వేయించుకుని గిన్నీస్ రికార్డ్ సాధించిన తండ్రి – uk man creates world record gets 667 tattoos of daughters name


World Record: ఎవరైనా సరే తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను ఒంటిపై పచ్చబొట్టు వేసుకుంటారు. ఎక్కువగా చేతుల మీద ఈ టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఇక ఇష్టమైన బొమ్మలు, సింబల్స్ ఇలా రకరకాలైన టాటూలను వేసుకుంటూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు. టాటూలు అంటే అన్నీ ఇన్నీ కాదు ఏకంగా 667 పచ్చబొట్లు వేసుకుని గిన్నీస్ రికార్డును కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు లైక్‌లు, షేర్లు చేస్తున్నారు.

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరును ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి ఈ టాటూలు వేయించుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఒకే పేరును శరీరంపై ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలోనే గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే గతంలో ఈ రికార్డ్ మార్క్ ఓవెన్ ఎవాన్స్ పైనే ఉండేది. 2017 లో ఓవెన్ ఎవాన్స్ కూతురు లూసీ పేరును.. తన వీపుపై 267 సార్లు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీంతో అది అప్పట్లోనే గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే 2020 లో అమెరికాకు చెందిన 27 ఏళ్ల డైడ్రా విజిల్ అనే మహిళ.. తన శరీరంపై 300 టాటూలు వేయించుకుని.. ఓవెన్ ఎవాన్స్ రికార్డును అధిగమించింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఓవెన్ ఎవాన్స్ ఎలాగైనా తన పాత రికార్డును తిరిగి సాధించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లూసీ అని తన శరీరంపై మరో 400 పచ్చబొట్లు వేయించుకున్నాడు. దీంతో మొదట వేయించుకున్న 267 ఆ తర్వాత వేసుకున్న 400 టాటూలతో కలిపి మొత్తం 667 పచ్చబొట్లు అయ్యాయి. దీంతో మరోసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఓవెన్ ఎవాన్స్‌ను వరించింది. తన శరీరంపై ఖాళీ లేకపోవడంతో ఈసారి ఎవాన్స్ తన తొడలపై కూడా టాటూలు వేయించుకున్నాడు. ఒక్కో తొడపై 200 చొప్పున రెండు తొడలపై 400 టాటూలు వేసుకున్నాడు. అయితే ఈ 400 పచ్చబొట్లు వేయడానికి ఇద్దరు టాటూ ఆర్టిస్టులు ఐదున్నర గంటల సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ డాడ్.. లక్కీ డాటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Wine: 22 లక్షల లీటర్ల వైన్ నేలపాలు.. రోడ్లపై వరదలా ప్రవాహం.. ఎందుకో తెలుసా?
Bride: ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వధువు మెరిసిపోవాలని వరుడు ఏం చేశాడంటే?
Read More Latest International News And Telugu News

Related Articles

Back to top button