Entertainment

Tarakaratna: తారకరత్న ఫస్ట్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?


గత నెల 18న కన్నుమూసిన హీరో తారకరత్న దశదిన కర్మ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో నిర్వహించారు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు.

నందమూరి…ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. నందమూరి తారక రామారావు సినిమాలు, రాజకీయాల్లో రాణించి, తెలుగునాట ఆయన ఇంటిపేరు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. ఎన్టీయార్‌ వారసులు కూడా సినిమాలు, రాజకీయాల్లో రాణించారు. వారిలో NTR వారసుడు నందమూరి మోహన కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న ఒకరు. అలాంటి ఒకటో నంబర్‌ కుర్రాడు.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారకరత్న వ్యక్త్విత్వం తెలిసినవాళ్లు అతని గురించి చెప్పే మాట ఇది. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటూ తిరిగే వ్యక్తి ఇవాళ తమ మధ్య లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పడే తారకరత్న పెద్ద ఖర్మ కార్యక్రమం కూడా ముగిసిపోయింది.

1983లో జనవరి 8వ తేదీన నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు చెన్నైలో జన్మించారు నందమూరి తారకరత్న. తారకరత్న నాన్న మోహనకృష్ణ, ఎన్టీయార్‌ నిర్మించిన కొన్ని సినిమాలకు డీఓపీగా, అంటే కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ దంపతులకు తారకరత్న ఒక్కరే సంతానం. చెన్నైలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేయడంతో నందమూరి కుటుంబం కూడా ఇక్కడికి షిఫ్ట్‌ అయ్యింది. తారకరత్న ఇక్కడ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్య, గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు. బైక్‌ రైడింగ్‌, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం తారక్‌కి అలవాటు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివారు. ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే 2002 ఒకటో నంబర్‌ కుర్రాడుతో ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారక్‌రత్న.

చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. తన బాబాయి బాలకృష్ణలాగే హీరో కావాలనుకున్నారు తారకరత్న. ఇదే మాటను బాబాయితో చెప్పేశారు. దీంతో బాలకృష్ణ చొరవ తీసుకొని తారకరత్నను హీరోగా పరిచయం చేశారు. తారక్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న 2002 సంవత్సరం ఒకటో నంబర్‌ కుర్రాడుతో ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. అప్పట్లో ఒకేరోజు 9 చిత్రాలు అనౌన్స్‌ చేసి చరిత్ర సృష్టించారు తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు గాను తారకరత్న తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయగా.. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఇది తారకరత్న ఇంట్రడక్షన్ మూవీ కాబట్టి.. కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలి అనుకున్నాం. అందుకే హీరో తారకరత్న రెమ్యూనరేషన్ తగ్గించాలని భావించినట్లు అశ్విని దత్ తెలిపారు.  దీంతో అన్ని ఖర్చులకు కలిపి తారకరత్నకు10 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button