News

tana international women’s day, ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. సందడి చేసిన రస్నా బేబీ అంకిత – tana celebrates international women’s day at philadelphia


ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం వెస్ట్ చెస్టర్ నగరంలో మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేసి, అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులతో సరిసమానంగా రాణిస్తున్న మహిళామణులందరిలో సృజనాత్మకతను తట్టి లేపే పలు కార్యక్రమాలు జరిగాయి. 600 మందికి పైగా పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రవాస తెలుగింటి ఆడపడుచులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలతో అలరించారు. మగువలు, చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

International Womens Day

సెలవుదినాన్ని సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా వేడుక కనులవిందుగా నిర్వహించారని విచ్చేసిన మహిళలు వారి అనుభూతిని నిర్వాహకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా.. ఇంతమంది ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలు, కేరింతలతో హోరేత్తించడం తమకు ఎంతోసంతృప్తినిచ్చిదని వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. రస్నా బేబీ, సింహాద్రిఫేమ్ చిత్ర కధానాయిక అంకిత ఝవేరి రాకతో వేడుక మరింత శోభాయమానంగా మారింది.

TANA

ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు శుభాకాంక్షలు తెలిపారు. తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం.. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఆర్ధిక, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాలలో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నతశిఖరాలు అందుకుంటున్నారని ప్రశంసించారు. ‘మహిళలు మీకు జోహార్లు’ అని వందనం చేశారు.

TANA Members

తానా కమ్యూనిటీసర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు. ఒక తల్లిగా, తోబుట్టువుగా, బిడ్డగా, భార్యగా రకరకాల అవతారాలలో మగవారి జీవితానికి ఒక అర్ధం పరమార్ధం తెచ్చేమహిళామూర్తులందరికి పాదాభివందనం అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తానా విమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి ఉమా కటికి ప్రసంగం మహిళలందరిలోను స్ఫూర్తినింపేలాగా సాగింది. తానా ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్లు అందించిన సేవలు, గృహహింసకు లోనైనా మహిళలకు, వరకట్న వేధింపులకుగురైన మగువలకు తానూ ఆసరాగా నిలిచినిన పలు సందర్భాలు నెమరేసుకున్నారు.

ప్రముఖ వైద్యులు డాక్టర్ శైలజ ముసునూరు, డాక్టర్ ప్రమీల మోటుపల్లి, డాక్టర్ ప్రశాంతి బొబ్బా, స్వర్ణ జెవెలర్స్ అలివేలు రాచమడుగు, మిస్ ఇండియా డెలావేర్ శ్వేతాకొమ్మోజిని ఘనంగా సత్కరించారు.

ధీర వనితలు: మిడ్ అట్లాంటిక్ మహిళా కోఆర్డినేటర్ సరోజ పావులూరి, భవాని క్రొత్తపల్లి, లక్ష్మి ముద్దన, మనీషా మేక, రాజేశ్వరి కొడాలి, భవాని మామిడి, దీప్తి కొక, రమ్య పావులూరి, లక్ష్మి కసుకుర్తి, మైత్రి నడింపల్లి, ఇందు పొట్లూరి, రూపముద్దన, హిమబిందు కోడూరు, స్మిత తదితరులు కార్యక్రమ విజయానికి కృషి చేశారు.

తానా కళా ప్రదర్శనలు

ఈ కార్యక్రమంలో తానా 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, తానా టీం స్క్వేర్ కో చైర్ కిరణోత్తపల్లి, రంజిత్ మామిడి, చలం పావులూరి, ఫణి కంతేటి, ప్రసాద్ కొత్తపల్లి, విశ్వనాథ్ కోగంటి, రామ ముద్దాన, రవి తేజముత్తు, కృష్ణ నందమూరి, కోటి బాబు యాగంటి, సాంబయ్య కోటపాటి, గోపి వాగ్వాల, సతీష్ మేక, సతీష్ చుండ్రు, వెంకట్సింగు, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, హర్రీస్ బర్గ్ తానా టీం, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీఅధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గున్నారు.

తానా ఫ్యాషన్ షో

వేడుకలో పసైందన విందు అందించినందుకు గాను డెక్కన్ స్పైస్ వారికీ, రుచికరమైన చిక్కని కాఫీ స్పాన్సర్ చేసినందుకు భూమి కాఫీ ప్రొప్రైటర్ పాపారావు ఉండవల్లి, స్వర్ణ జెవెల్స్ అధినేత లక్ష్మి మోపర్తి, వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీలక్ష్మి కులకర్ణి, మాన్విత యాగంటి, వ్యోం కొత్తపల్లి, కార్యక్రమం జయప్రదం చేసిన నారీమణులు, వాలంటీర్లకు ఫిలడెల్ఫియా తానా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.

Advertisement

Related Articles

Back to top button