Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి రియాక్షన్.. రాజకీయాలపై అవగాహన ఉందంటూ..
ఎం.కె.స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ నటీనటులు హాజరయ్యారు. విజయ్ సేతుపతి కూడా అక్కడకు అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ఫాలోయింగ్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సేతుపతి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. తాజాగా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ నటీనటులు హాజరయ్యారు. విజయ్ సేతుపతి కూడా అక్కడకు అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
విజయ్ సేతుపతి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తన రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సేతుపతి.. “ప్రస్తుతం యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలి. నాకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది.. కానీ ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం ఇప్పుడు చెప్పలేము” అంటూ చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి. దీంతో ఈ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి.. డైరెక్టర్ అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది.