Entertainment

Tamannaah: బాలయ్యతో ఆడిపాడనున్న మిల్క్ బ్యూటీ.. ఒక్క ఐటమ్ సాంగ్‌కు ఎంత తీసుకుంటున్నారంటే..?


అప్పుడు అబ్బాయితో బ్లాక్ బస్టర్ మాస్ నెంబర్‌లో ఆడి పాడిన తమన్న.. ఇప్పుడు బాబాయ్‌తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హీరోయిన్‌గా పెద్దగా ఫామ్‌లో లేకపోయినా… రెమ్యూనరేషన్ విషయంలో మిల్క్ బ్యూటీ నయా రికార్డ్స్ సెట్ చేస్తున్నారు.

అప్పుడు అబ్బాయితో బ్లాక్ బస్టర్ మాస్ నెంబర్‌లో ఆడి పాడిన తమన్న.. ఇప్పుడు బాబాయ్‌తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హీరోయిన్‌గా పెద్దగా ఫామ్‌లో లేకపోయినా… రెమ్యూనరేషన్ విషయంలో మిల్క్ బ్యూటీ నయా రికార్డ్స్ సెట్ చేస్తున్నారు. జై లవ కుశ సినిమాలో తారక్ ట్రిపుల్ యాక్షన్‌కు ఎంత హై వచ్చిందో… తమన్నా చేసిన స్పెషల్ సాంగ్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్‌ నెంబర్స్ లిస్ట్‌లో ఇప్పటికీ ఫ్లాష్ అవుతున్న ఈ పాటకు ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది.

జై లవ కుశలో సూపర్ హిట్ అయిన ఈ ఫార్ములాను NBK 108లో రిపీట్ చేయబోతున్నారు మేకర్స్‌. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాలోనూ స్పెషల్‌ సాంగ్ చేసేందుకు మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. డైరెక్టర్ అనిల్ రావిపూడితో తమన్నాకు మంచి రిలేషన్‌ ఉంది. గతంలో అనిల్ తెరకెక్కించిన ఎఫ్‌ 2, ఎఫ్ 3 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మిల్కీ బ్యూటీ… సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేశారు. ఇప్పుడు అనిల్‌ నెక్ట్స్‌ మూవీలోనూ బాలయ్య సరసన ఆడిపాడనున్నారు.

ఫస్ట్ టైమ్ బాలయ్యతో స్క్రీన్‌ షేర్ చేసుకునే ఛాన్స్ రావటంతో తమన్నా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి మిల్క్ బ్యూటీ  పేమెంట్ భారీగానే అందుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. జస్ట్ ఒక్క పాట కోసం కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంటున్నారట మిల్క్ బ్యూటీ.

ఇవి కూడా చదవండి



తమన్నా ఇన్‌స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button