Swapnalok fire accident: స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ.. | Kishan reddy inspects swapnalok fire accident spot
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాదం జరిగిన స్వప్పలోక్ కాంప్లెక్స్‌ను ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు..
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఆరుగురు యువతీ, యువకులు అగ్నికి ఆహూతి కావడం అందరినీ కలిచి వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాదం జరిగిన స్వప్పలోక్ కాంప్లెక్స్‌ను ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరపై మండిపడ్డారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరగుతోన్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు పోతున్నారు. ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు.. ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదు.’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎక్కువ ఆదాయం వస్తోందని అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉంటే అగ్నిప్రమాదం వల్ల దెబ్బతిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ 38ఏళ్ల నాటి నిర్మాణం కావడంతో డ్యామేజ్ జరిగినట్టు అంచనా వేశారు అధికారులు. 2 రోజులుగా భవన పటిష్టతను పరిశీలించింది జేఎన్టీయూ బృందం.. దీనిపై నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..