Balakrishna: బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు..దయచేసి ఇంకా సాగదీయద్దంటూ..
ఎస్వీ రంగారావు వారసులు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు. ఈమేరకు వివాదాన్ని ఇంకా సాగదీయద్దంటూ ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు , ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు.

Balakrishna, Svr Grand Sons
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. అక్కినేని నాగేశ్వర రావు, ఎస్వీ రంగారావులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఆందోళనలు చేపడుతున్నారు. అక్కడక్కడా బాలయ్య ఫ్లెక్సీలు, పోస్టర్లను కూడా దగ్ధం చేస్తున్నారు. తాజాగా ఎస్వీ రంగారావు వారసులు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు. ఈమేరకు వివాదాన్ని ఇంకా సాగదీయద్దంటూ ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు , ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. ‘నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేం ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణకు చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా ఉంటున్నాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్‌గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా హైలైట్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం’ అని విజ్ఞప్తి చేశారు.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన కామెంట్స్‌పై కాపు నేతలు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణతో పాటు టీడీపీకి కాపునాడు అల్టీమేటం ఇచ్చింది. ఈమేరకు బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఇప్పుడీ విషయంపై ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. మరోవైపు అక్కినేని అభిమానుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అనంతపురం ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అక్కినేని ఫ్యాన్స్.. బాలయ్య వ్యాఖ్యల విషయంలో మా అసోసియేషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ నిరసనకు దిగారు అక్కినేని ఫ్యాన్స్. బాలకృష్ణ అనుచిత వాఖ్యలను నిరసిస్తూ నర్తకి సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీ దగ్ధం చేసిన అక్కినేని ఫ్యాన్స్ వెంటనే తన వ్యాఖ్యలను డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..