Suryapet: నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా.. – Telugu News | Bear enters into a under construction building in suryapet town Telugu news
అనుకోని అతిథి ఎంట్రీతో సూర్యాపేటలోని ఓ కాలనీ వాసులు హడలిపోయారు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు.
అది ఓ టౌన్ ఏరియా. సమయం అర్థరాత్రి. ఓ నిర్మాణ దశలో ఉన్న భవనం ముందుకు వచ్చి పదుల సంఖ్యలో కుక్కలు మొరుగుతున్నాయి. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ ఇంటి యజమాని అనుమానస్పదంగా లోపలికి వెళ్లి చూడగా.. అనుకోని అతిథి కనిపించింది. అదేంటో కాదండోయ్ ఎలుగుబంటి. అవును ఓ ఎలుగుబంటి సూర్యాపేటలో హల్‌చల్ చేసింది. డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి రాత్రి ప్రవేశించింది. టౌన్‌లోకి ఎలుగుబంటి ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది.. స్పాట్‌కు చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన సామాగ్రి లేకపోవడంతో హైదరాబాద్ నుంచే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తున్న విషయం తెలిసిన విషమయే. ఈ మాడుపగలగొట్టే ఎండకు ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా కూడా మనం తట్టుకోలేకపోతున్నామ్. పాపం అడవి జంతువుల ఇంకెన్ని ఇబ్బందులు పడతాయో. నీళ్ల గుంతలు కూడా ఇంకిపోతాయ్. దీంతో తాపానికి వన్యప్రాణాలు జనవాసాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో.. ఇలాంటి జంతువులు ఏవైనా కనిపిస్తే.. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వండి. అంతేకానీ వాటిని ఆందోళనకు గురి చేయవద్దు. అలా చేస్తే అటాక్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..