News

Supreme Court: పన్నీర్‌ వర్గానికి ఎదురుదెబ్బ.. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే .. సుప్రీంకోర్టు కీలక తీర్పు | Supreme Court rejects OPS plea, affirms Madras HC decision to restore EPS as AIADMK’s sole leader


పన్నీర్‌ వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే అప్పగించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే చెందుతాయని సుప్రీంకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. ఈవిషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో పన్నీర్‌సెల్వం వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అమ్మ జయలలిత వారసత్వం తమకే చెందుతుందని పళనివర్గం వాదిస్తోంది. మద్రాస్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై పన్నీర్‌ సెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికి లాభం లేకుండా పోయింది. గత కొద్దినెలల నుంచి అన్నాడీఎంకే పన్నీర్‌ , పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే కంట్రోల్‌ మొత్తం పళనిస్వామి చేతి లోకి వెళ్లిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిలో పళనిస్వామి కొనసాగుతారు. జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైనదే అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.

ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా తీర్పు వెలువడిన తర్వాత చెన్నై అవ్వై షణ్ముగం రోడ్డులోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద వాలంటీర్లు సంబరాలు చేసుకున్నారు. జయలలిత, ఎంజీఆర్ విగ్రహాల దగ్గర ఎడప్పాడి పళనిస్వామి చిత్రపటానికి పాలభిషేకం చేసి, పటాకులు పేల్చి, మిఠాయిలు పంచి, ఫొటోలు దిగి సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button